శ్మశానంలో అస్థిపంజరంతో మహిళ డాన్స్ చూసి వణికిపోయిన బాటసారులు

శ్మశానంలో అస్థిపంజరంతో మహిళ డాన్స్ చూసి వణికిపోయిన బాటసారులు

ఇంగ్లండ్‌లోని హల్ జనరల్ స్మశానవాటికలో ఒక మహిళ చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గత 50 ఏళ్లుగా మూసివేసి ఉన్న ఈ చారిత్రక శ్మశానంలో, ఒక మహిళ మానవ అస్థిపంజరంతో కలిసి డ్యాన్స్ చేస్తూ, కుక్కతో ఆడుకుంటూ కనిపించింది. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం వేళ జరిగిన ఈ భయంకర దృశ్యాన్ని చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు తమ కార్ల వేగాన్ని తగ్గించి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.

ఈ వింత మహిళ గురించి స్థానికంగా కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి తీసిన ఫోటోతో అది నిజమని తేలింది. 1847లో నిర్మించిన ఈ శ్మశానవాటికలో 1800 కాలంలో కలరా వల్ల మరణించిన వారిని ఖననం చేసేవారు. నన్ లాంటి దుస్తులు ధరించి అస్థిపంజరంతో ఆమె ఎందుకు ఆనందంగా గెంతులేస్తోందో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *