‘జ్ఞానేష్ కుమార్ పోవాల్సిందే, ప్రధానే రాజీనామా చేయిస్తారు!’ CWC సమావేశంలో రాహుల్ సంచలనం
September 29, 2026

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేగుతున్న వివాదాల వేళ స్వయంగా ప్రధాని మోదీయే సీఈసీతో రాజీనామా చేయిస్తారని ఆయన జోస్యం చెప్పారు.
సమావేశంలో సీఈసీ రాజీనామా, ఎస్‌ఐఆర్ ఉపసంహరణ సహా మూడు ప్రతిపాదనలను రాహుల్ ప్రవేశపెట్టారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. దీనికి ప్రధాని, హోంమంత్రులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.