శ్మశానంలో అస్థిపంజరంతో మహిళ డాన్స్ చూసి వణికిపోయిన బాటసారులు
December 30, 2025

ఇంగ్లండ్‌లోని హల్ జనరల్ స్మశానవాటికలో ఒక మహిళ చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గత 50 ఏళ్లుగా మూసివేసి ఉన్న ఈ చారిత్రక శ్మశానంలో, ఒక మహిళ మానవ అస్థిపంజరంతో కలిసి డ్యాన్స్ చేస్తూ, కుక్కతో ఆడుకుంటూ కనిపించింది. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం వేళ జరిగిన ఈ భయంకర దృశ్యాన్ని చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు తమ కార్ల వేగాన్ని తగ్గించి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.
ఈ వింత మహిళ గురించి స్థానికంగా కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి తీసిన ఫోటోతో అది నిజమని తేలింది. 1847లో నిర్మించిన ఈ శ్మశానవాటికలో 1800 కాలంలో కలరా వల్ల మరణించిన వారిని ఖననం చేసేవారు. నన్ లాంటి దుస్తులు ధరించి అస్థిపంజరంతో ఆమె ఎందుకు ఆనందంగా గెంతులేస్తోందో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు.