మరదలి మనసు మొగుడి తమ్ముడిపై అలీగఢ్‌లో వివాహేతర సంబంధం కోసమే భర్త హత్య

మరదలి మనసు మొగుడి తమ్ముడిపై అలీగఢ్‌లో వివాహేతర సంబంధం కోసమే భర్త హత్య

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా గంగిరీ పరిధిలో వివాహేతర సంబంధం కారణంగా ఒక ఘోర హత్య జరిగింది. తన బావతో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో లలిత అనే మహిళ తన భర్త రిషి కుమార్‌ను చంపించింది. రిషి కుమార్ బంధువైన (తమ్ముడు వరుసయ్యే వ్యక్తి)తో లలితకు పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో భర్తను వదిలించుకోవాలని పథకం వేసి, జూన్ 17 రాత్రి అతడిని కాల్చి చంపారు.

ప్రారంభంలో ఎవరో దొంగతనం అనుమానంతో చంపేశారని నమ్మించడానికి లలిత ప్రయత్నించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. అనారోగ్యం నెపంతో ఆ రాత్రి పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిన లలిత, తన ప్రియుడికి సహకరించి భర్త హత్యకు బాటలు వేసింది. ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి కుమార్, తన తమ్ముడి పెళ్లి కోసం ఊరికి వచ్చి ఇలా భార్య చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *