చెక్ బౌన్స్ అయితే ఇక రెండేళ్ల జైలు శిక్ష ఆర్‌బీఐ సంచలన నిర్ణయం
December 30, 2025

బ్యాంకింగ్ లావాదేవీల్లో చెక్ బౌన్స్ సమస్యలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై చెక్ బౌన్స్ అయిన 24 గంటల్లోపు ఖాతాదారుడికి సమాచారం అందించడం తప్పనిసరి. అలాగే 5 లక్షల రూపాయలకు పైబడిన లావాదేవీలకు ‘పాజిటివ్ పే సిస్టమ్’ విధానాన్ని అమలు చేయాలి. దీనివల్ల చెక్కు వివరాలను ముందుగానే బ్యాంకుకు తెలియజేయడం ద్వారా మోసాలను అడ్డుకోవచ్చు.
ఉద్దేశపూర్వకంగా చెక్ బౌన్స్ చేసే వారికి గతంలో ఉన్న ఏడాది శిక్షను ఇప్పుడు రెండేళ్లకు పెంచారు. పదే పదే తప్పు చేసే వారి చెక్ బుక్ సౌకర్యాన్ని బ్యాంకులు రద్దు చేస్తాయి. అయితే ఖాతాలో తగినంత నగదు ఉన్నా బ్యాంక్ సాంకేతిక లోపాలతో చెక్ బౌన్స్ అయితే ఖాతాదారుడిపై ఎలాంటి జరిమానా విధించబడదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఆర్‌బీఐ ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.