అనుమానమే శాపమైంది ప్రియుడి వేధింపులు తాళలేక మైనర్ బాలిక బలవన్మరణం

అనుమానమే శాపమైంది ప్రియుడి వేధింపులు తాళలేక మైనర్ బాలిక బలవన్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మైనర్ బాలిక ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియుడు నిరంతరం అనుమానిస్తూ వేధించడంతోనే ఆ బాలిక అడవిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తేలింది. నవంబర్ 27న మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన బాలిక, రెండు రోజుల తర్వాత అడవిలో శవమై కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు.

నిందితుడు దిల్ రాజ్ మార్కమ్ ఆ బాలికకు వేరే వారితో సంబంధం ఉందని నిందిస్తూ తరచూ గొడవ పడేవాడు. ‘నువ్వు నన్ను మోసం చేస్తున్నావు’ అంటూ ఆమెను మానసికంగా కుంగదీశాడు. ఈ వేధింపులు భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుందని అదనపు ఎస్పీ నితీష్ ఠాకూర్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని జైలుకు తరలించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *