అక్రమ సంబంధానికి అడ్డని భర్త హత్య, మరిదితో సుపారీ ఇచ్చి చంపించిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డని భర్త హత్య, మరిదితో సుపారీ ఇచ్చి చంపించిన భార్య

ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను చంపించిన ఉదంతం కలకలం రేపింది. సోనియా అనే మహిళ తన ప్రియుడు రోహిత్‌తో కలిసి ఉండేందుకు, తన మరిది విజయ్‌కు 50 వేల రూపాయల సుపారీ ఇచ్చి భర్త ప్రీతమ్‌ను హత్య చేయించింది. జూలై 20న హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని మురికి కాలువలో పడవేసి, ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో సోనియాకు పంపాడు విజయ్. భర్త ఆటోను అమ్మేసి సోనియా ఆ సుపారీ సొమ్మును చెల్లించడం గమనార్హం.

భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది సోనియా. అయితే, హత్య చేసిన వ్యక్తి ప్రీతమ్ యొక్క ఖరీదైన మొబైల్‌ను పారేయకుండా వాడుతుండటంతో పోలీసులకు చిక్కాడు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా, ఆమె ప్రియుడు జైలులో ఉండగా, పరారీలో ఉన్న మరిది విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *