ఇరాన్ యుద్ధం త్వరలోనే ఖతం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
September 30, 2026

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం చాలా త్వరగా ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని, టెహ్రాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను పొందడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే సంవత్సరాల్లో చరిత్రకారులు ఈ యుద్ధాన్ని తమ ప్రభుత్వ అత్యంత కీలక నిర్ణయాలలో ఒకటిగా గుర్తుంచుకుంటారని ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ఆయన నుంచి ఈ ప్రకటన వచ్చింది.