సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం అర్జున్ టెండూల్కర్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ముంబై రికార్డు స్కోరు

సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం అర్జున్ టెండూల్కర్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ముంబై రికార్డు స్కోరు

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 75 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేసి సెలెక్టర్లకు గట్టి సమాధానమిచ్చాడు. అతనికి తోడుగా తమ్ముడు ముషీర్ ఖాన్ 66 పరుగులతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మరోవైపు గోవా బౌలర్ అర్జున్ టెండూల్కర్‌కు ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ముంబై బ్యాటర్ల ధాటికి అర్జున్ 8 ఓవర్లలోనే ఏకంగా 78 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా తరపున అర్జున్ టెండూల్కర్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చి పోరాడుతున్నాడు. యశస్వి జైస్వాల్ 46 పరుగులతో మెరవగా, సర్ఫరాజ్ వీరవిహారం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *