అమెరికా ఎఫ్‌బీఐ ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ జాబితాలో గోల్డీ బ్రార్, $10 లక్షల రివార్డు ప్రకటన
September 29, 2026

అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) అత్యంత తీవ్రమైన నేరస్థులతో విడుదల చేసిన ’10 మోస్ట్ వాంటెడ్’ జాబితాలో గ్యాంగ్‌స్టర్ సతిందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను చేర్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉత్తర అమెరికా విభాగాన్ని నడిపిస్తున్న ఇతని అరెస్టుకు లేదా సమాచారం అందించిన వారికి 10 లక్షల యుఎస్ డాలర్ల బహుమతిని ప్రకటించింది.
అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌పై నిఘా
అమెరికాలో ఉంటూ హత్యలు, కిడ్నాప్‌లు, ఆయుధాల అక్రమ రవాణా మరియు వసూళ్లతో కూడిన వ్యవస్థీకృత నేరాలను గోల్డీ బ్రార్ నిర్వహిస్తున్నాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈ అంతర్జాతీయ నేర ముఠాను అంతం చేసేందుకు అమెరికా నిఘా వర్గాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
ప్రతినిధి: వర్తమాన్ ఠాకూర్.