‘ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం చేతిలోకీలుబొమ్మ’! సీడబ్ల్యూసీ భేటీలో ఖార్గే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే బీజేపీ మరియు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 12 ఏళ్లలో బీజేపీ ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచిందని ఆరోపించారు. రాజ్యాంగం ఎన్నికల సంఘాన్ని ప్రజల ఓట్లకు రక్షకునిగా నియమించిందని, కానీ నేడు దాని నిష్పాక్షికతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.
ఓటర్ల జాబితా మార్పుల సమాచారం బహిర్గతం చేయాలని డిమాండ్ ఓటర్ల జాబితాలో చేసిన మార్పుల వివరాలను ఎన్నికల సంఘం సత్వరమే బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనితో పాటు జాబితా నుండి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని కోరింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ అవసరమని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.
ప్రతినిధి: వర్తమాన్ ఠాకూర్.