యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్‌ను కాలితో తన్నిన భార్య ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నా పుట్టినరోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ట్వింకిల్ తన భర్త అక్షయ్‌ను కాలితో తన్నడం కనిపిస్తుంది. దీనిపై అక్షయ్ స్పందిస్తూ, ప్రతి యాక్షన్ స్టార్ వెనుక తనను ఒక్క కిక్కుతో పడగొట్టే భార్య ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఎన్నో స్టంట్లు చేసినప్పటికీ, తన భార్య తన్నిన దెబ్బ అన్నింటికంటే శక్తివంతమైనదని ఆయన జోక్ చేశారు. అభిమానులు వీరిద్దరి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
2001లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఆరవ్, నితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్వింకిల్ ఖన్నా నటనకు స్వస్తి చెప్పి ప్రస్తుతం విజయవంతమైన రచయిత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన రాబోయే చిత్రాల్లో ‘భూత్ బంగ్లా’, ‘హేరా ఫేరి 3’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ మరియు సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘హైవాన్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సరదా బాండింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.