భారత అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ జోక్యంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘాటు స్పందన

భారత్‌లో మైనారిటీల రక్షణపై పాకిస్తాన్ చేసిన విమర్శలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. తన దేశంలోని దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచ దృష్టిని మరల్చడానికే పాకిస్తాన్ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. మైనారిటీలను అణచివేయడంలో పాకిస్తాన్‌కు ఉన్న చెత్త రికార్డును ఎవరూ మర్చిపోలేరని ఆయన గుర్తు చేశారు.
ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన చిన్నపాటి ఘటనలను సాకుగా చూపుతూ పాక్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోరడం హాస్యాస్పదమని భారత్ పేర్కొంది. పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు ప్రపంచం మొత్తం చూస్తోందని, ముందు తమ దేశ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని భారత్ చురకలు అంటించింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి లేదని విదేశీ వ్యవహారాల శాఖ తేల్చి చెప్పింది.