54 ఏళ్ల వయసులో కూతురిని పరిచయం చేసిన టబు! ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

54 ఏళ్ల వయసులో కూతురిని పరిచయం చేసిన టబు! ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

బాలీవుడ్ సీనియర్ నటి టబు తాజాగా ఒక సినిమా ప్రీమియర్ వేడుకలో నటి ఫాతిమా సనా షేక్‌ను తన కూతురిగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 54 ఏళ్ల టబు ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్న తరుణంలో, ఆమె ఫాతిమాను కూతురు అని పిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే, దీని వెనుక ఒక ఆసక్తికరమైన గతం దాగి ఉంది.

1997లో వచ్చిన ‘చాచీ 420’ సినిమాలో కమల్ హాసన్, టబుల కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది ఫాతిమా సనా షేక్. చాలా కాలం తర్వాత తనను కలవడంతో టబు ఎమోషనల్ అవుతూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమెను తన కూతురిగా కెమెరాల ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి ‘తల్లి-కూతుళ్ల’ బాండింగ్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *