మీరు వాడే సింధూరం నకిలీదా అయితే జాగ్రత్త పడాల్సిందే
December 29, 2025

వివాహిత మహిళల సౌభాగ్య చిహ్నమైన సింధూరం విషయంలో అప్రమత్తత అవసరం. మార్కెట్లో లభించే అనేక నకిలీ సింధూరాల్లో సీసం మరియు ఇతర ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. వీటిని వాడటం వల్ల చర్మ వ్యాధులు మరియు జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సహజసిద్ధమైన పద్ధతుల్లో తయారైన సింధూరాన్ని ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అసలైన సింధూరాన్ని గుర్తించడానికి ఒక చిన్న చిట్కా పాటించండి. కొంచెం సింధూరాన్ని అరచేతిలో వేసి రుద్ది ఊదినప్పుడు అది పూర్తిగా ఎగిరిపోతే అది అసలైనదిగా భావించాలి. ఒకవేళ అది రంగులా చేతికే అంటుకుని ఉంటే అందులో రసాయనాలు ఉన్నాయని గుర్తించాలి. కమీలా మొక్కల గింజల నుండి తయారైన సహజ సింధూరం వాడటమే శరీరానికి సురక్షితం.