టీ20 వరల్డ్ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ సంచలన రికార్డుకు ఎసరు పెట్టిన స్టార్ బ్యాటర్

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ సంచలన రికార్డుకు ఎసరు పెట్టిన స్టార్ బ్యాటర్

టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించరు. గత ప్రపంచకప్ విజయానంతరం వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం 1292 రన్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, 1220 రన్లతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి గైర్హాజరీలో కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

టాప్-5 జాబితాలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఏకైక ఆటగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్. 35 మ్యాచ్‌ల్లో 1013 రన్లు చేసిన బట్లర్, రాబోయే టోర్నీలో మరో 280 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటికే రిటైర్ అయిన మహేల జయవర్ధనే 1016 రన్లతో మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్ 984 రన్లతో ఐదో స్థానంలో ఉన్నారు. బట్లర్ తన ఫామ్‌ను కొనసాగిస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *