టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు ఏఐ సాంకేతికతతో కొత్త టోల్ విధానం
December 18, 2025

దేశవ్యాప్తంగా 2026 నాటికి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ సాంకేతికత ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే ప్రయాణించవచ్చు.
శాటిలైట్ మరియు ఏఐ సాయంతో వాహన నంబర్ ప్లేట్లను గుర్తించి ఆటోమేటిక్గా టోల్ వసూలు చేయబడుతుంది. దీనివల్ల రూ. 1,500 కోట్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయం రూ. 6,000 కోట్లు పెరుగుతుందని గడ్కరీ వివరించారు.