జీఎస్టీ నిబంధనల్లో కీలక సవరణలు! అధికారుల అరెస్ట్ అధికారాలకు కత్తెర, తగ్గిన జరిమానా మరియు రీఫండ్ గడువు
October 9, 2026

వ్యాపారులకు పెద్ద ఊరటనిస్తూ జీఎస్టీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. నూతన నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులను అరెస్ట్ చేసే జీఎస్టీ అధికారుల అధికార పరిమితిని తగ్గించారు.
క్రిమినల్ చర్యలు లేదా కేసులు నమోదు చేయడానికి కనీస పరిమితిని ₹1 కోటి నుండి ₹5 కోట్లకు పెంచారు. అంతేకాకుండా సాధారణ జరిమానాను ₹25,000 నుండి ₹10,000కి తగ్గించగా, రీఫండ్ ప్రక్రియ గడువును 15 రోజుల నుండి 10 రోజులకు కుదించారు.