లోక్‌సభలో టీఎంసీ ఎంపీ ఈ-సిగరెట్ తాగారా? బీజేపీ ఆరోపణలతో రేగిన దుమారం

లోక్‌సభలో టీఎంసీ ఎంపీ ఈ-సిగరెట్ తాగారా? బీజేపీ ఆరోపణలతో రేగిన దుమారం

టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ లోక్‌సభ లోపల ఈ-సిగరెట్ తాగారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, సభా నిబంధనలను ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీ స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.

దీనిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ, కేవలం ఐదు సెకన్ల వీడియో ఆధారంగా వ్యాఖ్యానించలేమని అన్నారు. బీజేపీ పూర్తి వీడియోను విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలతో నిరూపితమైతే, ఎంపీపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *