ఆస్తి కోసం కన్నవారిని ముక్కలుగా నరికి నదిలో పడేసిన కిరాతక కుమారుడు
December 18, 2025

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బులు, ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంతో అంబేష్ కుమార్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా రోకలి బండతో తలపై కొట్టి ప్రాణాలు తీసిన నిందితుడు, ఆపై వారి మృతదేహాలను ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలుగా నరికాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
హత్య అనంతరం సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు మృతదేహాల భాగాలను వేర్వేరు సంచుల్లో నింపి, తన కారులో తీసుకెళ్లి గోమతి నదిలో పడేశాడు. నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి విచారించగా, తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.