చైనా తీరానికి భారీగా చేరుతున్న రష్యా చమురు భారత్ దిగుమతులు తగ్గడమే కారణమా

చైనా తీరానికి భారీగా చేరుతున్న రష్యా చమురు భారత్ దిగుమతులు తగ్గడమే కారణమా

అమెరికా ఆంక్షల ప్రభావంతో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడంతో, భారీగా క్రూడాయిల్ చైనా తీరానికి చేరుతోంది. కెప్లర్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం సుమారు 34 లక్షల బారెళ్ల యూరల్స్ గ్రేడ్ చమురుతో కూడిన ఐదు ఓడలు చైనా ఎల్లో సీలో ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ చమురు నిల్వలు రెట్టింపు అయ్యాయి.

సాధారణంగా చైనా ఈ రకమైన చమురును కొనుగోలు చేయదు, కానీ భారత్ తన దిగుమతులను రోజుకు 20 లక్షల బారెళ్ల నుండి 8 లక్షలకు తగ్గించడంతో రష్యా కొత్త కొనుగోలుదారుల కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే రష్యా తన చమురు వ్యూహాన్ని తూర్పు ఆసియా వైపు మళ్లించినట్లు స్పష్టమవుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *