కుటుంబ కలహాలతో సరిహద్దు దాటి వచ్చిన పాక్ మహిళ భారత ఆర్మీకి చిక్కింది

కుటుంబ కలహాలతో సరిహద్దు దాటి వచ్చిన పాక్ మహిళ భారత ఆర్మీకి చిక్కింది

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన షెహనాజ్ అక్తర్ అనే పాకిస్థానీ మహిళను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. పీఓకేలోని కోట్లీ జిల్లాకు చెందిన ఈమె, కుటుంబ గొడవల కారణంగానే సరిహద్దు దాటినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం సైన్యం అదుపులో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించనున్నారు.

సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరగడంతో భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఇటీవల వరుస చొరబాటు కుట్రలను భగ్నం చేసిన నేపథ్యంలో, ఈ మహిళా అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులు ఆమె ఉద్దేశాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *