ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష! తోషాఖానా కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
December 20, 2025

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా-2 అవినీతి కేసులో కోర్టు 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సౌదీ అరేబియా యువరాజు బహుకరించిన విలువైన ఆభరణాల విషయంలో జరిగిన అవకతవకలకు గాను పాక్ ప్రత్యేక కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.
సెక్షన్ 409 కింద 10 ఏళ్లు, ఇతర అవినీతి చట్టాల కింద 7 ఏళ్ల శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా కూడా విధించారు. ఇప్పటికే జైలులో ఉన్న ఇమ్రాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. అయితే, ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని ఇమ్రాన్ దంపతులు నిర్ణయించుకున్నారు.