ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష! తోషాఖానా కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష! తోషాఖానా కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా-2 అవినీతి కేసులో కోర్టు 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సౌదీ అరేబియా యువరాజు బహుకరించిన విలువైన ఆభరణాల విషయంలో జరిగిన అవకతవకలకు గాను పాక్ ప్రత్యేక కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.

సెక్షన్ 409 కింద 10 ఏళ్లు, ఇతర అవినీతి చట్టాల కింద 7 ఏళ్ల శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా కూడా విధించారు. ఇప్పటికే జైలులో ఉన్న ఇమ్రాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. అయితే, ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని ఇమ్రాన్ దంపతులు నిర్ణయించుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *