సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఉపశమనం.

సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఉపశమనం.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుండి బిగ్ రిలీఫ్ లభించింది. రాహుల్ గాంధీపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్ని రకాల చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టుకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను పరిశీలించి విచారణ జరపాలని సీబీఐ (CBI), ఈడీ (ED)లను అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే, రాహుల్ సవాలుపై విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టుకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *