‘సముద్ర ధురంధరుడు’: భారత నౌకాదళంలోకి 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్లు

‘సముద్ర ధురంధరుడు’: భారత నౌకాదళంలోకి 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్లు

సముద్ర నిఘా, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం, ఆగస్టు 17న అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ (GA-ASI) సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు MQ-9B సీ గార్డియన్ హై-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ (HALE) డ్రోన్లను 30 నెలల లీజు ప్రాతిపదికన భారత నౌకాదళానికి అందించనున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు ₹1,943 కోట్లు.

అధునాతన సెన్సార్లు, పేలోడ్లతో కూడిన ఈ డ్రోన్లు ఎక్కువ ఎత్తులో సుదీర్ఘకాలం పాటు ఎగురుతూ విస్తారమైన సముద్ర ప్రాంతాన్ని పర్యవేక్షించగలవు. నిఘా సమాచార సేకరణ, అక్రమ రవాణా నిరోధం, శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తులను పసిగట్టడంలో ఇవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.

సాధారణంగా ఆయుధాల కొనుగోలు ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది, కానీ ఈ లీజు నమూనా ద్వారా నూతన సాంకేతికతను వేగంగా అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ 30 నెలల కాలంలో నౌకాదళ సిబ్బంది శిక్షణ పొందడమే కాకుండా, భవిష్యత్తులో ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద ఇటువంటి డ్రోన్ల తయారీ, సేకరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రోన్ల చేరిక భారత్ సముద్ర భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *