పెంపుడు కుక్క అనారోగ్యం తట్టుకోలేక ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

పెంపుడు కుక్క అనారోగ్యం తట్టుకోలేక ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమ ఇద్దరు యువతుల ప్రాణాలను బలిగొంది. జలాల్‌పూర్‌కు చెందిన రాధా మరియు జియా అనే ఇద్దరు సోదరీమణులు తమ జర్మన్ షెపర్డ్ కుక్క అనారోగ్యంతో పడుతున్న బాధను చూడలేక తీవ్ర మనస్తాపానికి గురై ఫినాయిల్ తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కరోనా సమయంలో ఒక కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తండ్రి గత ఆరు నెలలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు దూరమవ్వడం ఆ తల్లిదండ్రులను కోలుకోలేని దెబ్బ తీసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *