టీ20 ప్రపంచకప్ కోసం అఫ్గానిస్తాన్ భారీ స్కెచ్ పటిష్టమైన 15 మంది సభ్యుల జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్ కోసం అఫ్గానిస్తాన్ భారీ స్కెచ్ పటిష్టమైన 15 మంది సభ్యుల జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్ 2026 కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించనున్న ఈ జట్టుకు ఇబ్రహీం జద్రాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులోకి స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ మరియు పేసర్ నవీన్ ఉల్ హక్ తిరిగి రావడం విశేషం. వీరితో పాటు షాహిదుల్లా కమల్ మరియు వికెట్ కీపర్ మహమ్మద్ ఇషాక్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన అఫ్గానిస్తాన్, ఈసారి ఆసియా పిచ్‌లపై సత్తా చాటి ట్రోఫీ నెగ్గాలని పట్టుదలగా ఉంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్లతో కూడిన ‘గ్రూప్ ఆఫ్ డెత్’లో అఫ్గాన్ తలపడనుంది. గుల్బదిన్ నైబ్ మరియు నవీన్ ఉల్ హక్ రాకతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైందని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ పటిష్టమైన స్పిన్ దళంతో అఫ్గానిస్తాన్ ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *