పెద్ద బ్రెయిన్ స్ట్రోక్ రాకముందే మీ శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలను గుర్తించండి

పెద్ద బ్రెయిన్ స్ట్రోక్ రాకముందే మీ శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలను గుర్తించండి

మెదడులోని రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. అయితే ప్రాణాంతకమైన భారీ అటాక్ రాకముందే శరీరం ‘మినీ బ్రెయిన్ స్ట్రోక్’ రూపంలో కొన్ని సంకేతాలను ఇస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ‘ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్’ అంటారు. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోతుంది. ముఖం లేదా కాళ్లు, చేతులు తిమ్మిరి రావడం, మాట్లాడటంలో ఇబ్బంది, అకస్మాత్తుగా చూపు మందగించడం మరియు శరీర సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

ఈ మినీ స్ట్రోక్ లక్షణాలు 24 గంటల్లో తగ్గిపోయినప్పటికీ, వీటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. స్ట్రోక్ ముప్పును తగ్గించుకోవడానికి ఆహారంలో ఉప్పు, కొవ్వు పదార్థాలను తగ్గించి ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ముఖ్యంగా యాపిల్, అరటి, క్యారెట్, బీట్‌రూట్ వంటివి తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *