న్యూ ఇయర్ వేళ భారీ షాక్ నేడు స్విగ్గీ జొమాటో మరియు ఫ్లిప్‌కార్ట్ సేవలు బంద్

నూతన సంవత్సర వేడుకల సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ మరియు ఇతర డెలివరీ సేవలపై ఆధారపడే వారికి భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ భాగస్వాములు సమ్మెకు దిగారు. టిజిపిడబ్ల్యూయు మరియు ఐఎఫ్ఎటి నేతృత్వంలో సుమారు లక్ష మందికి పైగా కార్మికులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. దీనివల్ల నేడు ఆన్‌లైన్ ఆర్డర్లు అందడం కష్టమని, ప్లాన్ బి సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువ వేతనాలు మరియు ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి ప్రధాన సమస్యలపై ఈ సమ్మె జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని గిగ్ వర్కర్లు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. సంస్థలు కేవలం లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ తమను వేధిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పండుగ రోజున డెలివరీలలో జాప్యం లేదా ఆర్డర్ల రద్దు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వినియోగదారులకు స్పష్టం చేశారు