భారత్ తీరుపై నిప్పులు చెరిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

భారత్ తీరుపై నిప్పులు చెరిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీస ఆధారాలు లేని ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేయడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే స్పందించని దేశాలు, పుతిన్ నివాసంపై దాడి అంటే మాత్రం త్వరగా స్పందిస్తున్నాయని ఆయన విమర్శించారు.

భారతదేశం అవలంబిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి శాంతి చర్చలకు ఆటంకం కలిగిస్తుందని జెలెన్ స్కీ హెచ్చరించారు. అటు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కూడా భారత్, పాకిస్థాన్ ల స్పందనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. రష్యా తప్పుడు ప్రచారాలను నమ్మి అంతర్జాతీయ వేదికలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాస్తవాలను గుర్తించి బాధితుల పక్షాన నిలబడాలని ఉక్రెయిన్ కోరింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *