FSSAI సంచలన నిర్ణయం: గుడ్ల నాణ్యత తనిఖీకి దేశవ్యాప్త నమూనా పరీక్షల ఆదేశం, దాగి ఉన్న ప్రమాదం ఏమిటి?

గుడ్ల నాణ్యతపై వివాదాలు, నైట్రోఫ్యూరాన్స్ (Nitrofurans) అనే నిషేధిత యాంటీబయాటిక్ ఉండవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అప్రమత్తమైంది. తక్షణమే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గుడ్ల నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపాలని ఆ సంస్థ తమ ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశించింది. బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ గుడ్ల నమూనాలను దేశంలోని పది ల్యాబొరేటరీలకు పంపనున్నారు.
ఈ రసాయన అవశేషాలు విషపూరితం, క్యాన్సర్ కారకం, జన్యుపరమైన నష్టాలను కలిగిస్తాయి కాబట్టి, పిల్లలకు చాలా హానికరం. దీర్ఘకాలిక వినియోగం కాలేయ నష్టం లేదా రోగనిరోధక శక్తి తగ్గించే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈలోగా, ‘ఎగగోజ్’ (Eggoz) సంస్థ తమ వెబ్సైట్లో ల్యాబ్ నివేదికలను విడుదల చేసి, ఉత్పత్తి సురక్షితమని, నిషేధిత పదార్థాలు ఏవీ లేవని భరోసా ఇచ్చింది.