ప్రియాంకతో విభేదాలు దేశం విడిచిన రాహుల్ గాంధీ

ప్రియాంకతో విభేదాలు దేశం విడిచిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ముదిరాయి. పార్లమెంటులో ప్రియాంక గాంధీ ప్రసంగానికి వచ్చిన ప్రశంసలపై అసంతృప్తితో ఉన్న రాహుల్ గాంధీ, తన సోదరితో గొడవపడి జర్మనీ వెళ్ళిపోయారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయిందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనవాలా విమర్శించారు. మరోవైపు, మల్లికార్జున ఖర్గేను తొలగించి పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీకి అప్పగించాలని ఒడిశా సీనియర్ నేత సోనియా గాంధీకి లేఖ రాయడం పార్టీలో నాయకత్వ సంక్షోభాన్ని మరింత పెంచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *