36 పరుగుల అవమానం నుండి మెల్బోర్న్ వీరోచిత విజయం వరకు టీమిండియా అద్భుత ప్రయాణం

36 పరుగుల అవమానం నుండి మెల్బోర్న్ వీరోచిత విజయం వరకు టీమిండియా అద్భుత ప్రయాణం

2020లో ఇదే రోజున భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అడిలైడ్ టెస్టులో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన అవమానాన్ని చెరిపివేస్తూ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ వంటి దిగ్గజాలు లేకపోయినా, తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే తన అద్భుత సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించారు. మ్యాచ్ మధ్యలో ఉమేష్ యాదవ్ గాయపడినా, పట్టుదలతో పోరాడి ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించారు.

ఈ మ్యాచ్ ద్వారా మహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ వంటి యువ కిశోరాలు భారత క్రికెట్ రంగ ప్రవేశం చేశారు. బుమ్రా, సిరాజ్ ఘాటైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు తలవంచక తప్పలేదు. ఎనిమిది వికెట్ల తేడాతో సాధించిన ఈ విజయం సిరీస్‌ను సమం చేయడమే కాకుండా, భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి చేర్చింది. మెల్బోర్న్ మైదానంలో భారత్‌కు ఇది నాలుగో టెస్టు విజయం, ఇది విదేశీ గడ్డపై భారత జట్టు సత్తాను చాటిచెప్పిన మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *