సిఎస్కె జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ భావోద్వేగ సందేశం
December 18, 2025

అబుదాబిలో జరిగిన ఐపిఎల్ 2026 వేలంలో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 75 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. తొలి రౌండ్లో ఎవరూ కొనుగోలు చేయనప్పటికీ, తర్వాత ధోనీ సేన అతడిని జట్టులోకి తీసుకుంది. గత రెండు సీజన్లలో అన్‌సోల్డ్‌గా ఉన్న సర్ఫరాజ్, ఈ అవకాశంతో అమితానందం వ్యక్తం చేశారు.
“నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిన సిఎస్‌కెకు ధన్యవాదాలు” అని సర్ఫరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆయన, 2026 సీజన్లో చెన్నై జట్టును విజేతగా నిలబెట్టడమే తన లక్ష్యమని వెల్లడించారు. 2023 తర్వాత ఆయన మళ్లీ ఐపిఎల్ బరిలోకి దిగుతున్నారు.