ముందుగా హిందూ మిత్రులకు విందు ఇచ్చారని వివాదం బరేలీలో ముస్లిం రైతు కుమార్తె నిఖా విందు బహిష్కరణ
December 18, 2025

ఉత్తరప్రదేశ్లోని బరేలీలో తన కుమార్తె నిఖా వేడుకలో హిందూ స్నేహితులకు ముందుగా శాఖాహార విందు ఇచ్చినందుకు ఒక ముస్లిం రైతు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. స్థానిక మౌల్వీల ప్రేరణతో గ్రామస్థులు విందును బహిష్కరించడంతో ఆ కుటుంబానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తర్వాత గ్రామస్థులు తమ తప్పును ఒప్పుకోవడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. దీంతో ఆయన తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు వెల్లడించారు.