శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసే దిశగా హర్మన్‌ప్రీత్ సేన అడుగులు
December 30, 2025

ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళా జట్టు నేడు శ్రీలంకతో జరగనున్న చివరి పోరులో తలపడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి లంకను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస ఓటములతో కుంగిపోయిన చామరి ఆటపట్టు బృందం క్లీన్‌స్వీప్ ముప్పు నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగనుంది.
ఈ సిరీస్‌లో భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేయగా భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. గత మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా ప్రదర్శన చూస్తుంటే లంక జట్టుపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. నేటి పోరులో కూడా భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుని సిరీస్‌ను 5-0తో ముగించాలని చూస్తోంది.