మనుషులను కరిస్తే కుక్కలకు కూడా ఇకపై జీవితఖైదు ప్రభుత్వ సంచలన నిర్ణయం

ప్రయాగ్‌రాజ్‌లో వీధి కుక్కల దాడులు మరియు మనుషులను కరిచే ఘటనలు విపరీతంగా పెరగడంతో యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఏదైనా కుక్క మొదటిసారి ఎవరినైనా కరిస్తే దానిని పది రోజుల పాటు పరిశీలనలో ఉంచి శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చుతారు. అయితే అదే కుక్క రెండోసారి కూడా దాడికి పాల్పడితే దానికి ‘జీవితఖైదు’ విధిస్తారు. అటువంటి కుక్కలను జీవితాంతం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లలోని షెల్టర్ హోమ్స్ లో బంధించి ఉంచుతారు.
ప్రస్తుతం నగరంలో వీధి కుక్కల సంఖ్య లక్షా 15 వేలకు పైగా ఉండటంతో ప్రతి నెలా దాదాపు నాలుగు వేల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సంతానోత్పత్తి నియంత్రణ మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. పెంపుడు జంతువులకు లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల నుండి ఆశించిన స్పందన రాకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.