భారత్ దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్! ఎయిర్ స్ట్రైక్ నష్టాన్ని స్వయంగా అంగీకరించిన పాక్ ఉప ప్రధానమంత్రి
December 29, 2025

భారత వైమానిక దాడుల ధాటికి తాము భారీగా నష్టపోయామని పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని చకాలాలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన అంగీకరించారు. ఈ దాడుల్లో పాక్ సైనికులు కూడా గాయపడ్డారని ఆయన తెలపడం గమనార్హం. ఇది పాకిస్థాన్ సైనిక సామర్థ్యంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గడిచిన 36 గంటల్లో భారత్ సుమారు 80 డ్రోన్లను పాకిస్థాన్ పైకి పంపిందని ఇషాక్ దార్ వెల్లడించారు. వీటిలో 79 డ్రోన్లను తాము అడ్డుకున్నామని వాదించినప్పటికీ, ఒక డ్రోన్ తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకొని నష్టాన్ని కలిగించిందని ఆయన ఒప్పుకున్నారు. భారత సైన్యం యొక్క ఖచ్చితమైన వ్యూహరచన ముందు పాక్ రక్షణ వ్యవస్థ విఫలమైందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.