ప్రియురాలితో సాన్నిహిత్యం మేనల్లుడిని ముక్కలుగా నరికిన మేనమామ

ప్రియురాలితో సాన్నిహిత్యం మేనల్లుడిని ముక్కలుగా నరికిన మేనమామ

బీహార్‌లోని భాగల్పూర్‌లో దారుణం జరిగింది. తన ప్రియురాలితో సాన్నిహిత్యం పెంచుకున్నాడనే కోపంతో మేనల్లుడు అభిషేక్‌ను మేనమామ సంతోష్ కిరాతకంగా చంపించాడు. ఇందుకోసం ఇద్దరు స్నేహితులకు రెండు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు మేనమామ స్వయంగా పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం.

డిసెంబర్ 24న అభిషేక్‌ను కిడ్నాప్ చేసిన నిందితులు, అతడిని కాల్చి చంపి శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి గంగా నదిలో పడేశారు. పోలీసుల లోతైన విచారణలో మేనమామ అసలు రంగు బయటపడింది. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు, మేనమామ సహా నలుగురిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *