పెళ్లి ఫిక్స్ అయిందని ప్రియుడిపై ప్రియురాలి ఘాతుకం

పెళ్లి ఫిక్స్ అయిందని ప్రియుడిపై ప్రియురాలి ఘాతుకం

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వివాహిత ప్రియురాలు తన ప్రియుడిపై చేసిన దాడి స్థానికంగా కలకలం రేపింది. ఒకే మాల్‌లో పనిచేస్తున్న వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే, ఇటీవల ఆ యువకుడికి వేరే యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో ఆగ్రహం చెందిన ప్రియురాలు, తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చింది. చివరకు ఒక గదిలో కలుసుకున్న సమయంలో, పక్కా పథకం ప్రకారం బ్లేడ్‌తో అతని మర్మాంగాన్ని కోసేసింది.

తీవ్ర రక్తస్రావంతో యువకుడు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటన అనంతరం నిందితురాలు అక్కడి నుండి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *