తప్పుడు సంకేతం ప్రాణం తీసింది బంజీ జంపింగ్‌లో ఊహించని విషాదం

తప్పుడు సంకేతం ప్రాణం తీసింది బంజీ జంపింగ్‌లో ఊహించని విషాదం

కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలో బంజీ జంపింగ్ చేస్తూ 25 ఏళ్ల యెసేనియా మోరల్స్ గోమెజ్ అనే యువతి మరణించింది. తన ప్రియుడితో కలిసి ఈ సాహస క్రీడలో పాల్గొనడానికి వెళ్లిన ఆమెకు శిక్షకుడు ఇచ్చిన తప్పుడు సంకేతం మృత్యువుగా మారింది. రక్షణ కవచం మరియు తాడు కట్టకముందే శిక్షకుడు తన ప్రియుడిని దూకమని చెప్పగా, అది తనకేనని భ్రమపడి ఆమె 160 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకేసింది.

వైద్య నివేదికల ప్రకారం ఆమె కింద పడకముందే భయంతో గుండెపోటుకు గురై గాల్లోనే ప్రాణాలు విడిచింది. ఈ సాహస క్రీడను నిర్వహిస్తున్న సంస్థకు ఎటువంటి అనుమతులు లేవని విచారణలో తేలింది. అడ్వెంచర్ గేమ్స్ ఆడేవారు భద్రతా నియమాలను సరిగ్గా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక చిన్న పొరపాటు కారణంగా నిండు ప్రాణం గాల్లో కలిసిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *