ఢిల్లీలో తగ్గుతున్న సగటు ఆయుష్షు నివేదికలో విస్తుపోయే నిజాలు
December 17, 2025

ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లలో ఢిల్లీ నివాసితుల సగటు ఆయుష్షు దాదాపు 1.7 ఏళ్లు తగ్గింది. కాలుష్యం, నీటి నాణ్యత తగ్గడం మరియు మారుతున్న జీవనశైలి కారణంగానే ఢిల్లీ, పంజాబ్ ప్రజల జీవితకాలం క్షీణిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాల్లో మెరుగైన జీవన ప్రమాణాల వల్ల ప్రజల సగటు ఆయుష్షు పెరగడం విశేషం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాల్లో తక్షణ నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.