కొడుకు లెటర్ రహస్యంగా చదివిన తండ్రి కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష
December 29, 2025

స్పెయిన్లోని సెవిల్లె నగరంలో 10 ఏళ్ల కుమారుడి వ్యక్తిగత లేఖను అతని అనుమతి లేకుండా చదివినందుకు ఒక తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ లేఖను బాబు మేనత్త రాశారు, అందులో తండ్రి ప్రవర్తన గురించి కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. పిల్లల ప్రైవసీని ఉల్లంఘించినందుకు జైలు శిక్షతో పాటు సుమారు 2.33 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
కోర్టులో తండ్రి వాదిస్తూ అది పొరపాటున జరిగిందని చెప్పినప్పటికీ, న్యాయమూర్తి ఆ వాదనను తోసిపుచ్చారు. తండ్రి అయినప్పటికీ పిల్లల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. మేనత్త ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కోర్టు, పిల్లల హక్కులను కాపాడటమే ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది.