కెనడా వైద్య వ్యవస్థపై మండిపడ్డ ఎలాన్ మస్క్ చికిత్స అందక భారత సంతతి వ్యక్తి మృతి చెందిన వైనం

కెనడా వైద్య వ్యవస్థపై మండిపడ్డ ఎలాన్ మస్క్ చికిత్స అందక భారత సంతతి వ్యక్తి మృతి చెందిన వైనం

కెనడాలోని ఎడ్మంటన్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఏకంగా ఎనిమిది గంటల పాటు నిరీక్షించి ప్రశాంత్ శ్రీకుమార్ అనే భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. 44 ఏళ్ల ప్రశాంత్‌కు పనిలో ఉండగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయన్ను వెయిటింగ్ రూమ్‌లోనే ఉంచారు. చివరకు చికిత్స కోసం పిలిచే సమయానికే ఆయన గుండెపోటుతో మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ ఘటనపై స్పందించిన ఎలాన్ మస్క్ కెనడా ఆరోగ్య వ్యవస్థ తీరును తీవ్రంగా విమర్శించారు. తన భర్త మరణానికి కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ భార్య నిహారిక న్యాయం కోరుతున్నారు. కెనడాలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయని అక్కడి భారతీయ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *