కృష్ణుడి స్థానంలో చెరసాలకు వచ్చిన యశోద కుమార్తె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

కృష్ణుడి స్థానంలో చెరసాలకు వచ్చిన యశోద కుమార్తె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

మధుర కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే, గోకులంలో యశోదమ్మకు యోగమాయ అనే కుమార్తె జన్మించింది. దైవప్రేరణతో వసుదేవుడు కృష్ణుడిని గోకులంలో విడిచిపెట్టి, ఆ ఆడబిడ్డను మధుర చెరసాలకు తీసుకువచ్చాడు. కంసుడు ఆ శిశువును చంపడానికి ప్రయత్నించగా, ఆమె ఆకాశంలోకి ఎగిరి దేవి రూపంలో ప్రత్యక్షమైంది. తనను సంహరించేవాడు ఇప్పటికే సురక్షిత ప్రాంతంలో పెరుగుతున్నాడని కంసుడిని హెచ్చరించి అదృశ్యమైంది.

పురాణాల ప్రకారం, ఆ దేవి వింధ్య పర్వతాలకు చేరుకుని ‘వింధ్యవాసిని దేవి’గా వెలిశారు. విష్ణుమాయగా పిలవబడే ఈమెను కాత్యాయని, చాముండేశ్వరి అని కూడా భక్తులు కొలుస్తారు. నేటికీ వింధ్యాచల్ శక్తిపీఠంలో అమ్మవారు కొలువై ఉండి భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. లోక కల్యాణం కోసం దేవి వివిధ రూపాల్లో భూమిపై భక్తులకు దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *