ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు కొత్త చట్టంతో పొగతాగే వారికి చుక్కలు

ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు కొత్త చట్టంతో పొగతాగే వారికి చుక్కలు

కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం లభించడంతో దేశంలో పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం సిగరెట్లపై సుంకాన్ని వెయ్యి శలాకలకు గరిష్టంగా 11,000 రూపాయల వరకు పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రస్తుతం 18 రూపాయలు పలుకుతున్న ఒక్కో సిగరెట్ ధర ఏకంగా 72 రూపాయలకు చేరే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో సామాన్యుల జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

యువతలో ధూమపాన అలవాటును తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సిగరెట్లతో పాటు హుక్కా మరియు జర్దా వంటి ఇతర పొగాకు ఉత్పత్తులపై కూడా పన్నులు భారీగా పెరగనున్నాయి. ధరల పెరుగుదల వల్ల చాలామంది ధూమపానానికి స్వస్తి చెప్పే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నప్పటికీ అక్రమ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ భారీ ధరల పెరుగుదల ధూమపాన నియంత్రణకు ఎంతవరకు తోడ్పడుతుందో వేచి చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *