ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా

శరీర దృఢత్వానికి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది, అయితే వయస్సును బట్టి వీటిని తీసుకునే పరిమాణంలో మార్పులు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, 5 నుండి 10 ఏళ్ల పిల్లలు రోజుకు ఒకటి, 10 నుండి 15 ఏళ్ల వారు రెండు గుడ్లు తీసుకోవాలి. ఇక 15 నుండి 20 ఏళ్ల యువత రోజుకు మూడు నుంచి నాలుగు గుడ్లు, 20 నుండి 30 ఏళ్ల వారు రెండు నుంచి మూడు గుడ్ల వరకు నిరభ్యంతరంగా తినవచ్చు.

కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుడ్ల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వారంలో మూడు రోజులు గుడ్డులోని పచ్చసొన తీసేసి కేవలం తెల్లసొన మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన పద్ధతిలో గుడ్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా పోషక విలువలు అందడమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *