‘అబ్బాయిలు తిడితే పర్లేదు, అమ్మాయిలు నోరు విప్పితేనే సమస్య’: మనుస్మృతిని ప్రస్తావిస్తూ మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు
August 23, 2026

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థినుల నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. అబ్బాయిలు దుర్భాషలాడితే లేని సమస్య, అమ్మాయిలు తమ నిరసన తెలిపితే ‘కల్చరల్ షాక్’ అని అనడం మనుస్మృతికి సంబంధించిన పితృస్వామ్య మనస్తత్వానికి నిదర్శనమని రాహుల్ మండిపడ్డారు. ‘ఛాత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, మహిళలు ఎవరి ఆస్తి కాదని, దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి సంకెళ్లను తెంచుకోవాలని పిలుపునిచ్చారు.