అనుమానం పెనుభూతమైంది సెలవు రోజున క్రికెట్ బ్యాట్‌తో భార్యను కొట్టి చంపిన భర్త
December 31, 2025

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మృతురాలు ఒక సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి. గత ఆదివారం వీరిద్దరి మధ్య గొడవ జరగగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అమీన్పూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు, అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ వివాహేతర సంబంధాన్ని అతని భార్య దీప్తి బట్టబయలు చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.